సీఎం జగన్‌ దూరదృష్టికి సలాం: విజయసాయిరెడ్డి

సీఎం జగన్‌ దూరదృష్టికి సలాం: విజయసాయిరెడ్డి jagananna 2

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలల హాజరు రికార్డుల్లో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌ సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కొనియాడారు.ఇందు మేరకు ఆయన శుక్రవారం ట్విటర్‌ లో ఒక ట్వీట్ చేసారు.

పాఠశాల హాజరు రికార్డుల్లో విద్యార్థులు కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. కుల, మత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం అని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *