సీఎం పదవి నుంచి తొలగించాల్సిందే… సుప్రీం కోర్టులో సంచలన పిటిషన్!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ వ్రాసిన సంగతి తెలిసినదే. అదే ఇప్పుడు హల్ చల్ గా మారింది. తాజాగా, సుప్రీం కోర్టులో మరో సంచలన పిటిషన్ దాఖలైంది.
ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీం కోర్టులో న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్ వేశారు. ఇది ఇలా ఉండగా దాదాపు 30 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పడమే కాక ఇలాంటి వ్యక్తి కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఇలా ఎలా ఆరోపణలు చేస్తాడని అన్నారు.