స్టేట్ బ్యాంక్ లో కొత్త రూల్స్

స్టేట్ బ్యాంక్ లో కొత్త రూల్స్ sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయి. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌‌లో పలు మార్పులు చేసింది స్టేట్ బ్యాంక్. ఏటీఎం మోసాలను నియంత్రించాలనే ధ్యేయం తోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ రూ.10,000 లేదా ఆపైన డబ్బులని ఏటీఎం నుంచి విత్‌ డ్రా చెయ్యాలంటే ఓటీపీ ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది.

బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇలా ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవాలి. ఈ ఫెసిలిటీ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే గతం లో ఉండేది. కానీ ఈ ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను ఇప్పుడు రోజంత వినియోగించుకోవచ్చు. ఈ ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్ ఏటీఎం ఎస్‌బీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలకు వర్తించదు. కానీ ఇలా ఓటీపీ ద్వారా చేయడం వల్ల మోసాలు తగ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *