ఏడాది పాటూ సాక్షి పేపర్ సచివాలయానికి వేసినందుకు రూ.4లక్షలా…?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ ని ఇలా ప్రశ్నించాడు…. జగన్ సాక్షి పేపర్‌కు సర్క్యూలేషన్ పెంచుకోవడానికి కష్టాలు పడుతున్నాడని, కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని అన్నాడు. అలానే అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న మీరు దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడమేమిటి అని అన్నాడు. ఇది ఇలా ఉండగా గుంటూరులోని సచివాలయానికి ఏడాది పాటూ రోజూ సాక్షి పేపర్ రెండు ప్రతుల చొప్పున వేసిందుకు డబ్బులు కేటాయించారు. అడ్వాన్స్ కింద రూ.4 లక్షల 14వేలు కేటాయించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *